ఇకపై వాట్సాప్‌లోనూ బుకింగ్

by Shyam |
ఇకపై వాట్సాప్‌లోనూ బుకింగ్
X

దిశ, సికింద్రాబాద్: భారత్ గ్యాస్ వినియోగదారులు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా తమ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా గ్యాస్ బుకింగ్ పేమెంట్లను మరింత సరళతరం చేసినట్లు భారత్ పెట్రోలియం సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ముందుగా 1800 22 4344 నంబర్‌ను తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోని హాయ్ అని మెసేజ్ పంపాలి. వెంటనే సంస్థ నుంచి గ్యాస్ బుకింగ్ కోసం ‘ఒకటి’ సంఖ్య లేదా బుక్ అని బదులివ్వాలి. దీంతో ఒక్క క్షణంలో గ్యాస్ బుక్ అవుతుంది. వెంటనే వినియోగదారుడికి తమ సమీప డీలర్ వద్ద గ్యాస్ బుక్ అయ్యిందని మెసెజ్ రావడంతో పాటు పేటీఎం, అమెజాన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లతో ఆన్ లైన్ పేమెంట్ వివరాలు వస్తాయి. ఇది చాలా సులభమైన మార్గమని, కోట్ల సంఖ్యలో ఉన్న తమ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని భారత్ గ్యాస్ డీలర్ల సంఘం ప్రతినిధి డి.అశోక్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed