కోవాగ్జిన్' వినియోగంపై భారత్ బయోటెక్ మార్గదర్శకాలు

by Anukaran |
కోవాగ్జిన్ వినియోగంపై భారత్ బయోటెక్ మార్గదర్శకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన కొద్దిరోజుల తర్వాత కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ వల్ల కలిగే దుస్ప్రభావాలు, ప్రయోజనాలపై భారత్ బయోటెక్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల సీరమ్ వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లోనే ఇద్దరు చనిపోయారనే వార్తలు, విమర్శలను ఎదుర్కొనేందుకే ఈ సూచనలను జారీ చేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు లాంటి వివరాలను వివరంగా తెలుపుతూ ఫ్యాక్స్‌షీట్‌ను విడుదల చేసింది. ప్రధానంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇప్పటికే రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపే మెడిసిన్ వాడుతున్న వారు, ఏదైనా అలర్జీ ఉన్న వ్యక్తులు ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్‌ను తీసుకోవద్దని భారత్ బయోటెక్ వివరించింది. అదేవిధంగా రక్తస్రావం వంటి ఇబ్బందులు ఉన్నవారు తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు, జ్వరం, పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోకూడదని హెచ్చరించింది. అంతేకాకుండా మరొక కంపెనీ వ్యాక్సిన్‌ను తీసుకున్న వారు ‘కోవాగ్జిన్’ను తీసుకోకపోవడం మంచిదని స్పష్టం చేసింది. కాగా, ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగం కోసం అనుమతించిన రెండు సంస్థల్లో భారత్ బయోటెక్ కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed