- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచంలో ఎక్కడా ఎమర్జెన్సీ వచ్చినా సిద్ధం: భారత్ బయోటెక్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కడా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సాయానికి సిద్ధంగా ఉన్నామని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. అమెరికన్ కంపెనీల వద్ద లేని బీఎస్ఎల్ 3 సామర్థ్యం మాకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రస్తుతం 20మిలియన్ టీకా డోసులు ఉన్నాయని, 700 మిలియన్ల డోసుల తయారీ మా లక్షమన్నారు. ఆదివారం వర్చువల్ ప్రెస్‌మీట్‌లో కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ప్రస్తుతం 123దేశాలకు సేవలు అందిస్తున్నామని, ప్రపంచ స్థాయి జర్నల్స్‌లో భారత్ బయోటెక్‌పై 70కి పైగా వ్యాసాలు వచ్చాయని, యూకేలోనూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు గుర్తు చేశారు.
మా కంపెనీ భారత్‌కే పరిమితమైంది కాదని, గ్లోబల్ కంపెనీ అన్న కృష్ణ ఎల్ల.. చికెన్ గున్యా సహా అనేక వ్యాధులకు వ్యాక్సిన్లు తయారు చేసినట్లు వివరించారు. కావాలనే కొన్ని భారతీయ కంపెనీలు తమపై దుష్ఫ్రచారం చేస్తున్నాయన్నారు. మేం తయారు చేసిన టీకా 200శాతం సురక్షితమని, యూకే స్ట్రెయిన్ పైనా కొవాగ్జిన్ చక్కగా పనిచేస్తుందని, మా ప్రయోగ పద్ధతులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజీ ఆమోదించిందని వెల్లడించారు. భారత్ బయోటెక్ ఏ విదేశీ సంస్థకూ తీసిపోదని, ఫైజర్ వంటి విదేశీ సంస్థలతో సమానంగా మా సంస్థ పబ్లికేషన్స్ కలిగి ఉందన్నారు.
మేం 25వేల మందిపై ప్రయోగాలు నిర్వహించామని, వాలంటీర్లపై ప్రయోగాలు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్స్‌గా చెప్పొచ్చునని తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో మాకు సుదీర్ఘ అనుభవం ఉందని, ఇప్పటివరకు 16వ్యాక్సిన్లు రూపొందించామని, భారత్ సహా అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన విదేశీ కంపెనీలు అనుమతి పొందాయన్నారు. త్వరలో ముక్కు ద్వారా తీసుకొనే కరోనా టీకా తీసుకువస్తామని, ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితగా ఉండి.. ఇన్ ఫెక్షన్, వ్యాప్తి నివారిస్తుందని తెలిపారు.