అఖిలపక్ష నేతల భేటీ.. భారత్ బంద్‌ విజయవంతం చేయాలి..

by Sridhar Babu |
అఖిలపక్ష నేతల భేటీ.. భారత్ బంద్‌ విజయవంతం చేయాలి..
X

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అఖిల పక్షం పిలుపు మేరకు మంగళవారం సారపాక పట్టణ అధ్యక్షుడు మువ్వా వెంకటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను లూటీ చేస్తున్నదని, అనేక పరిశ్రమలను, ప్రభుత్వ ఆస్తులను అంబాలనీకు, అదానీలకు కారు చౌకగా అమ్మేస్తున్నదని అన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని, రైతులపై నల్ల చట్టాలను తీసుకు వచ్చి రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వారికి స్వేచ్ఛ లేకుండా కార్పొరేట్ వ్యవస్థను తీసుకువస్తున్నదని ఆరోపించారు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో 9 నెలల పాటు అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా.. మోడీ ప్రభుత్వంలో చలనంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ సవరణ బిల్లును ఆపాలని, కార్మికుల హక్కులను కాల రాస్తున్న 39 రకాల హక్కులను 4 కేటగిరీలుగా మార్చి ప్రైవేట్ యజమానులకు అన్ని అర్హతలు కలిపిస్తున్న మోడీ ప్రభుత్వం వెంటనే ఆ విధానాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాపాడాలని ఈ నెల 22న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద జరిగే ధర్నాకు, 27వ తేదీన దేశ వ్యాప్తంగా భారత్ బంధుకు, 30వ తేదీన అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి, అక్టోబర్ 5న పోడు భూముల పట్టాల గురించి రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ముద్దా. బిక్షం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పులపెల్లి సుధాకర్ రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సీపీఐ మండల అధ్యక్షులు తాళ్లూరు. జగదీశ్వరరావు, కాకర్ల సత్యనారాయణ, సీపీఐ జిల్లా నాయకులు పేరాల శ్రీనివాసరావు, సిద్దారపు సుబ్బారెడ్డి, పాండవుల బిక్షం జహీర్, మందా నాగరాజు, వంకాయలపాటి నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ, కణితి కృష్ణ, కోతమర్తి. వెంకటేశ్వర్లు, రహీమ్ ఖాన్, బోడ దివ్య, సీపీఎం నుంచి అభిడ మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story