పల్లెలు ఎప్పుడూ… పచ్చగా ఉండాలి

by Aamani |   ( Updated:2020-08-11 05:00:52.0  )
పల్లెలు ఎప్పుడూ… పచ్చగా ఉండాలి
X

దిశ, భైంసా: పచ్చని చెట్లతో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని భైంసా రూరల్ ఎస్సై పున్నమ్ చందర్ అన్నారు. మంగళవారం మండలంలోని పెండ్‌పల్లి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎస్సై, గ్రామ సర్పంచ్, కవిత వార్డు సభ్యులతో కలిసి చెట్లు నాటారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు రాజేందర్ మాట్లాడుతూ… ఇప్పుడు నాటిన మొక్కలు, వృక్షాలుగా మారి హరితహారానికి సాక్షులుగా నిలవాలన్నారు. కాలుష్యం నివారించే, పచ్చని వాతావరణంలో పల్లెలు ఉండేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

Advertisement

Next Story