- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా సమయంలో సేవలు.. కరీంనగర్ జిల్లావాసికి అరుదైన గౌరవం
దిశ, ధర్మపురి : కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో సమాజానికి సేవలందించిన పలువురిని కరోనా వారియర్ 2021 అవార్డుతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి సన్మానించారు. ముంబైలోని రాజ్ భవన్‌లో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మపురికి చెందిన కొరిడె అమర్‌నాథ్‌కు కరోనా వారియర్ 2021 అవార్డ్‌ను గవర్నర్ కోషియారి ప్రధానం చేశారు.
అయితే, అమర్‌నాథ్.. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చిక్కుకున్న చాలా మంది వలస కార్మికులను ఆదుకొని వారికి రావలసిన జీతాలు ఇప్పించడమే కాకుండా వారిని తమ సొంత రాష్ట్రాలకు సురక్షితంగా తరలించారు. అదే విధంగా కరోనా మహమ్మారి సమయంలో పలు ప్రాంతాల్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందించడం లాంటి సేవలను అందించినందుకు గాను అమర్‌నాథ్‌కు ఈ అవార్డును ప్రధానం చేశారు. డా. భూషణ్ జాదవ్ గారి నేతృత్వంలోని పరానుభూతి ఫౌండేషన్, సందీప్ గుప్త నేతృత్వంలోని హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా ఆపద కాలంలో సమాజానికి సేవలందించిన మరో12 మందిని కూడా గవర్నర్ సన్మానించారు.