- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ వజ్రం ధరించిన ఫస్ట్ బ్లాక్ లేడీగా బియాన్సీ రికార్డ్!
దిశ, ఫీచర్స్ : అమెరికా పాప్ సింగర్, వరల్డ్ రిచెస్ట్ పాప్‌స్టార్ బియాన్సీ, సోల్‌మేట్ అమెరికన్ ర్యాపర్ జే జెడ్ ఇద్దరూ 2000లో కలుసుకున్నారు. 2001 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2002లో ఇద్దరూ కలిసి పాటలు పాడటం మొదలుపెట్టగా.. 2008లో ఒక్కటయ్యారు ఈ క్యూట్ కపుల్స్. ఈ మేరకు తాజాగా ప్రపంచ ప్రఖ్యాత టిఫనీ కంపెనీ ‘అబౌట్ లవ్’ ప్రచారంలో పాల్గొన్న ఈ జంట.. క్యాంపెయిన్ యాడ్‌లో భాగంగా బిగ్ ఎల్లో స్టోన్‌ను ధరించిన బియాన్సీ. ఆ వజ్రాన్ని ధరించిన నాల్గో వ్యక్తిగా, ప్రపంచంలోనే మొదటి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించింది.
1877లో దక్షిణాఫ్రికాలో బిగ్ ఎల్లో స్టోన్‌ను మొదటిసారిగా కనుగొనగా, 1878లో టిఫనీ & కో వ్యవస్థాపకుడు చార్లెస్ లూయిస్ టిఫనీ దాన్ని కొనుగోలు చేశాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు వజ్రాలలో ఒకటి కాగా.. చాలా అరుదైనదిగా వివిధ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. ఆనాటి నుంచి ఈ వజ్రాన్ని మేరీ వైట్ హౌస్, అమెరికన్ దౌత్యవేత్త ఎడ్విన్ షెల్డన్ వైట్ హౌస్ భార్య, హాలీవుడ్ ఐకాన్ ఆడ్రీ హెప్బర్న్‌తో పాటు 2019 ఆస్కార్ వేడుకల్లో గాయని లేడీ గాగా మాత్రమే ధరించారు. అయితే ఇన్నేళ్లలో తొలిసారి ఆ వజ్రాన్ని ప్రకటన ప్రచారంలో ప్రదర్శించగా, దీంట్లో పాప్ స్టార్ బియాన్సీ, ఆమె భర్త జే జెడ్‌లు నటించారు. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ ఇంతకు ముందు మ్యూజిక్ ప్రాజెక్ట్‌ల కోసం కలిసి వచ్చినప్పటికీ, ఒకే ప్రకటన ప్రచారంలో వారిద్దరూ కలిసి కనిపించడం కూడా ఇదే మొదటిసారి. ఈ లవ్‌బర్డ్స్ సోషల్ మీడియాలో ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
మాసన్ పూల్ చిత్రీకరించిన ‘అబౌట్ లవ్’ క్యాంపెయిన్ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా, బియాన్సీ, జే-జెడ్‌లపై వీడియో ప్రకటనను కూడా చిత్రీకరించారు. ఇందులో బియాన్స్ 1961 చిత్రం ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’లోని ప్రఖ్యాత పాట ‘మూన్ రివర్’ను ఇందులో వాడుకున్నారు. అలాగే టిఫనీ & కో చారిత్రాత్మకంగా బ్లాక్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల (HBCU లు) కోసం స్కాలర్‌షిప్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం $ 2 మిలియన్లను విరాళంగా ఇస్తుందని, ఇవి ఆఫ్రికన్-అమెరికన్ కమ్యూనిటీకి సేవ చేయడానికి ఉద్దేశించినవని టిఫనీ కంపెనీ తెలిపింది.
లవ్, స్ట్రెంత్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ కోసం నిలబడే మా బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి బియాన్సీ, జే-జెడ్‌లు పర్‌ఫెక్ట్ కపుల్స్. ఆధునిక ప్రేమకథకు వాళ్లిద్దరూ ప్రతిరూపంగా నిలుస్తారు.
– అలెగ్జాండర్ ఆర్నాల్ట్, టిఫనీలో ప్రొడక్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్.