- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PAN కార్డ్‌తో జరభద్రం.. ఆదమరిస్తే చిక్కులు తప్పవు
దిశ, డైనమిక్ బ్యూరో : నగదు రహిత లావాదేవీల వినియోగం పెరిగిపోవడంతో ప్రతిచోటా స్వైపింగ్ మిషన్లు, యూపీఐ ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉంచుతున్నారు వ్యాపారులు. ఇదివరకు నగదుతోనే లావాదేవీలు చేసేవారు. దీంతో చాలా మంది వ్యాపారులు ట్యాక్స్‌ను ఎగ్గొట్టేవారు. కానీ, ప్రస్తుతం ఏ లావాదేవి జరిగినా డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లు అన్నీ పాన్ నెంబర్, మొబైల్ నెంబర్‌కు అనుసంధానం చేసి ఉండటంతో ప్రతి లావాదేవీ నమోదవుతోంది.
ఇంతలా పాన్ నెంబర్ అవసరం అవుతోంది. దీంతో తెలియకుండానే చాలా చోట్ల పాన్ వివరాలను ఇచ్చేస్తున్నాం. కానీ అలా ఇవ్వడం వల్ల చిక్కుల్లో పడొచ్చని, గోప్యత పాటించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన పాన్ వివరాలతో ఇతర వ్యక్తులు లావాదేవీలు చేసే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా?. అయితే, ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకోండి.
ఓ రిక్షా కార్మికుడు బ్యాంకు ఖాతా కోసం పాన్ కార్డును అప్లై చేసేందుకు నెట్ సెంటర్‌కు వెళ్లారు. అతని పూర్తి వివరాలు తెలుసుకొని పాన్ కార్డు అప్లై చేసి, పాన్ వివరాలు తెలుసుకున్నారు. ఇలా కార్మికుడి పాన్ నెంబర్ పై గుర్తు తెలియని దుండగులు రూ.43 కోట్ల వ్యాపారాన్ని చేశారు. దీంతో రూ.3 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఐటీ నోటీసులు పంపింది. దీంతో మోసపోయానని గ్రహించిన కార్మికుడు ఐటీ శాఖను సంప్రదించాడు. దీంతో పాన్ వివరాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మోసపోయారో లేదో ఇలా తెలుసుకోండి
మీ పాన్ వివరాలతో లావాదేవీలు జరిగాయని అనుమానం ఉంటే ఇలా చేయండి. ఏడాదికి రెండు సార్లు ఐటీ రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో పాన్ మీద జరిపిన లావాదేవీలు తెలుసుకోవచ్చు. ఒకవేళ పాన్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకొని మోసం చేసినా ట్రాన్సాక్షన్ డేటా ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు, ఫారం 26ఏఎస్‌ను వినియోగించి పాన్ లావాదేవీలు తెలుసుకోవచ్చు. దీనిని ఏడాదిలో వీలైనన్ని సార్లు వినియోగించడం మంచిదని బ్యాంకింగ్ రంగ నిపుణలు పేర్కొంటున్నారు.