- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్ల యజమానులు జాగ్రత్త
దిశ, తెలంగాణ బ్యూరో: కారు కొనాలనేది ప్రతి సగటు భారతీయుడి కల. ఈ ఆధునిక యుగంలో కార్లు లేకుంటే స్థాయి తగ్గిపోతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కస్టమర్ల టేస్ట్ కు అనుగుణంగా కంపెనీలు సైతం పలు మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. కొత్తగా ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలను సైతం అన్ని కంపెనీలు తమ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ కార్లు కొన్నాక వాటి మెయింటనన్స్ సరిగ్గా నిర్వహించకపోయినా, సర్వీస్ చేయించకున్నా మీ కారు దగ్ధమవ్వడం ఖాయం. ఇటీవల జరిగిన పలు ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాధారణంగా వేసవిలో వాహనాలు దగ్ధమవ్వడం ఎక్కువగా చూస్తుటాం. కానీ వర్షాకాలంలో సైతం దగ్ధమవ్వడానికి కారణం మెయింటనన్స్ తో పాటు కొన్ని పరికరాలను అసెంబుల్డ్ చేసుకోవడమేనని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాటిలో లోపాల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు స్పష్టం పేర్కొంటున్నారు. కార్ల యజమానులు వాహన పిట్ నెస్ చెక్ చేసుకొని, లోపాలను ఎప్పటికప్పడు సరిచూసుకొని బయటకు వెళ్లడం ఉత్తమమని రవాణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో వాహనాలన్నీ హై ఎండ్ ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ వెహికిల్స్ సైతం జోరు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడొస్తున్న వాహనాల్లో అయితే అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉంటున్నాయి. ఇవన్నీ బ్యాటరీ ఆధారంగానే పనిచేస్తాయి. ఈ క్రమంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లడం వల్ల బ్యాటరీలపై అధిక భారం పడుతోంది. ఇంజిన్స్ సైతం హై టెంపరేచర్ కలిగినవి ఉండటంతో ఐ కంప్రెషర్ రేషియో వల్ల ఇంజిన్ నుంచి వేడి హీట్ ఉత్పన్నమవుతోంది. దీంతో ఇంజిన్ కంపార్ట్ మెంట్ నుంచి మంటలు చెలరేగేందుకు ఒక కారణంగా నిలుస్తోంది. దీనికి తోడు ఎక్ట్ర్ ట్రా లైట్లు, హారన్, ఇతర అసెంబుల్డ్ పరికరాలను కార్ల యజమానులు బిగించుకుంటున్నారు. ఈ సమయంలో మెకానిక్ వీటిని సరిగ్గా బిగించకున్నా, కరెంట్ సరఫరా జరిగే కేబుళ్లకు క్యాప్స్ పెట్టకున్నా వైరింగ్ సిస్టం దెబ్బతిని మంటలు చెలరేగే అవకాశాలుంటాయి. సాధారణంగా మన వద్ద మెకానిక్ లు వైర్లు అతికించి ప్లాస్టర్ చుట్టి వదిలేస్తుంటారు. అలా కాకుండా వాటికి క్యాప్స్ పెట్టమని సూచించిడం ఉత్తమం. లేదంటే విద్యుత్ లీకేజీ జరిగి కారు వానలో తడిస్తే షార్ట్ సర్క్యూట్ జరిగి కారుకు నిప్పంటుకునే ప్రమాదముంది.
కారు వీల్స్ లో లోపాలున్నా, గాలి నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉన్నా, బ్రేకులు సరిగ్గా లేకున్నా వాహనం వేగంగా వెళ్తున్న సమయంలో రాపిడి పెరిగి మంటలు వ్యాపించే ప్రమాదముంది. అంతేకాకుండా కారులో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకునే డాష్ బోర్డ్ వద్ద నాణ్యతలేని కేబుళ్లు వాడినా ప్రమాదం తప్పదని రవాణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే కేబుల్ హీటెక్కి సీటు కాలి క్రమంగా కారుకు మంటలంటుకునే అవకాశాలుంటాయని వారు చెబుతున్నారు. కొవిడ్ సమయం నుంచి ప్రతి ఒక్కరూ శానిటైజర్లు వినియోగిస్తున్నారు. అయితే వీటిలో ఆల్కహాల్ బేస్ డ్ శానిటైజర్లను కార్లలో వినియోగించకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. జెల్ టైప్ లో ఉండేవి వాడితే ప్రమాదం జరగదని సూచిస్తున్నారు. విద్యుత్ లీకేజీల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయాల్లో గ్యాస్ వినియోగిస్తున్న వాహనాలుంటే మరింత ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. అయితే మాన్యుఫ్యాక్చర్ డిఫెక్ట్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా అరుదు అని రవాణశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే కార్ల సంస్థలు వాహనాలన్నింటినీ రీకాల్ కు పిలిచి సమస్యలు పరిష్కరిస్తున్నాయంటున్నారు. ఇటీవల మారుతి సుజూకి 1.80 లక్షల కార్లను ఫ్యూయెల్ పంపులో లోపాలుండటం వల్ల రీకాల్ కు పిలిచిన విషయం విధితమే. ఇలాంటి ప్రమాదాలు కేవలం కార్లకే కాకుండా హెవీ వెహికిల్ వాహనాల్లో సైతం చోటుచేసుకుంటున్నాయి. నెలన్నర క్రితం జనగామ జిల్లాలో సూపర్ లగ్జరీ బస్సుకు ప్రమాదం జరిగి పూర్తిగా దగ్ధమైంది. గతంలో మహబూబ్ నగర్ లో బస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవదహనమయ్యారు. అప్రమత్తత లేకుంటే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. వాహనదారులు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఫిట్ నెస్ చూసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
డ్రైవర్లు అలర్ట్ గా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ఎంతో అలర్ట్ గా ఉండాలి. వాహనానికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా రిపేర్లు చేయించుకోవాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. డ్రైవర్ కు ఇంజిన్ లో లోపాలున్నా ముందుగానే హెచ్చరికలు చేసేలా అన్ని వాహనాల్లో అలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవాలి. ఇప్పటికే ఈ సదుపాయం కొన్ని వాహనాలకు ఉన్నా అన్ని లోకల్ భాషల్లో అనౌన్స్ మెంట్ లాగా వస్తే చదువుకోని డ్రైవర్లు కూడా అప్రమత్తమవుతారు. దీనివల్ల ప్యాసింజర్ల ప్రాణాలకు ఎలాంటి హాని జరగదు. వాహనాల్లో ప్రయాణించే సమయంలో ప్యాసింజర్లు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది.
= పుప్పాల శ్రీను, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, ఆదిలాబాద్