శరీరం విశ్రాంతి కోరుకుంటుందా… అయితే ఈ ఆసనం ట్రై చేయండి

by Anukaran |   ( Updated:2021-04-06 23:43:50.0  )
శరీరం విశ్రాంతి కోరుకుంటుందా… అయితే ఈ ఆసనం ట్రై చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ గా గడుపుతున్నారు. పని ఒత్తిడిలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసిన అలసట అంతా ఆరోగ్యం మీద పడుతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేయమంటున్నారు యోగా నిపుణులు. డైలీ రొటీన్ లైఫ్ లో యోగాను భాగం చేసుకుంటే ఆరోగ్య సమస్యలతో పాటు అలసట, ఒత్తిడి నుండి దూరం కావచ్చని చెప్తున్నారు. శరీర ధృడత్వాన్ని పెంచే యోగాసనాల్లో శవాసనం ప్రాముఖ్యమైంది.

శవాసనాన్ని “మృతాసన” అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో శవం అంటే మృతదేహం. అది ఎలా ఏ కదలిక లేకుండా పడుకుంటుందో.. ఈ ఆసనం కూడా ఏ కదలిక లేకుండా ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారు. దీనివలన మనిషి లోపల ఉన్న అలసట, ఒత్తిడి తగ్గుతాయి. ముందుగా వెల్లకిలా పడుకోని కాళ్లు, చేతులు దూరంగా ఉంచాలి. చేతులు, కాళ్లుని కదలనివ్వకుండా కళ్లు మూసుకొని దృష్టి అంతటిని శరీరం మీద ఉంచాలి. శ్వాసని నెమ్మదిగా పీలుస్తూ, వదులుతూ ఉండాలి. ఈ ఆసనం వలన శరీరంలోని అన్ని అవయవాలు విశ్రాంతి పొంది మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed