సోషల్ మీడియా అడిక్షన్ లేని వధువు.. దొరుకుతుందా?

by Shyam |
సోషల్ మీడియా అడిక్షన్ లేని వధువు.. దొరుకుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పేది ‘పెళ్లి’. అందుకే పర్‌ఫెక్ట్ మ్యాచ్ కోసం వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు.. ఎన్నెన్నో కాలిక్యులేషన్స్, ఏవేవో ఈక్వేషన్స్ చూస్తుంటారు. కాగా ఇప్పుడిక పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. దీంతో కరోనా రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే.. పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే మాట్రిమోనియల్ సైట్స్‌లో వధూవరుల బయోడేటాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అయితే యంగ్ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిల ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయి. తమకు కాబోయే భార్య/భర్త విషయంలో చాలా క్లారిటీతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారి నితిన్ సంగ్వాన్ కూడా ఆ అబ్బాయి మ్యాట్రిమోనల్ ప్రకటనను తన ట్విట్టర్‌లో షేర్ చేయడం విశేషం. ఇంతకీ అందరినీ ఆకట్టుకుంటున్న ఆ ప్రకటనలో ఏముంది? అతగాడు ఎలాంటి వధువు కావాలని కోరుకుంటున్నాడు?

వెస్ట్ బెంగాల్, కమర్పూర్‌‌కు చెందిన ఛటర్జీ అనే వ్యక్తి ఈ మ్యాట్రిమోనల్ ప్రకటన ఇచ్చాడు. ఇందులో తన డిటేయిల్స్ వివరిస్తూ.. ‘యోగా ప్రాక్టీషనర్, అందంగా ఉంటాను, ఎలాంటి దురలవాట్లు లేవు. హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడిని. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పూర్‌లో మరో ఇళ్లు కూడా ఉంది, కట్నం అడగను’ అని తన గురించి తెలిపాడు. అయితే, తనకు కాబోయే వధువు ‘అందంగా ఉండాల్సిన అవసరం లేదు. రంగు, ఎత్తు, బరువు లాంటి విషయాల్లో నాకెలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ప్రధానంగా సోషల్ మీడియాకు మాత్రం బానిస కాకూడదు’ అంటూ ప్రకటన ఇచ్చాడు.

సోషల్ మీడియా మన జీవితంలో ఎంతగా భాగమయ్యిందో తెలిసిన విషయమే. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు అందరూ ఫోన్లకు తెగ అడిక్ట్ అయిపోయారు. పర్సనల్ లైఫ్‌ను వీడి గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఛటర్జీ అదే సమస్యను టార్గెట్ చేస్తూ.. తనకు కాబోయే వధువు మాత్రం సోషల్ మీడియాకు మాత్రం అడిక్ట్ కావద్దంటూ చేసిన ప్రకటనే నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంది. దాన్ని ఐఏఎస్ ఆఫీసర్ నితిన్ సంగ్వాన్ కూడా షేర్ చేస్తూ.. వధువు/వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి, ‘వధూవరులు ప్లీజ్ పే అటెన్షన్’ అంటూ దీన్ని ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed