ఓటరు కార్డు మీద కుక్క ఫొటో

by Shamantha N |
ఓటరు కార్డు మీద కుక్క ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్:
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సునీల్ కర్మాకర్ తన ఓటరు కార్డులో తప్పులు ఉంటే సరిచేయాలని కొన్ని రోజుల కింద దరఖాస్తు చేశాడు. తప్పులు సరిచేసిన ఓటరు కార్డు మంగళవారం రోజున ఇంటికి వచ్చింది. అయితే ఆ కార్డు చూసిన సునీల్ షాకయ్యాడు. అందులో అతను సరిచేయించుకున్న సమాచారం సరిగానే ప్రింటయ్యింది కానీ … అతని ఫొటోకి బదులుగా ఓ కుక్క ఫొటో ఉండటంతో ఆశ్చర్యపోయాడు. అయితే దీని గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పరువు నష్టం దావా వేస్తానని సునీల్ అన్నారు.

ఎలక్షన్ కమిషన్ తన పరువు తీయడానికే కావాలని ఇలాంటి ఫొటో ప్రచురించిందని, ఇది చూసిన వాళ్లందరూ తనను హేళన చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ తెలిపారు. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి స్పందిస్తూ… ఈ తప్పును తాము ముందే గ్రహించామని, కానీ సరిచేయకుండా ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో కుక్క ఫొటోను గమనించినపుడే, కర్మాకర్ ఇంటికి వెళ్లి ఆయన ఫొటో కోసం ప్రయత్నించామని, కానీ కుక్క ఫొటో ప్రింట్ ఎలా అయిందో తెలియట్లేదని వివరించారు.

సిటిజన్‌షిప్ స్క్రీనింగ్ ఎక్సర్‌సైజ్ పనిలో భాగంగా బెంగాల్ ఉద్యోగులకు పనిభారం పెరిగింది. దీని కారణంగా ఇలాంటి పొరపాటు జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పౌరసత్వ వెరిఫికేషన్ సమస్య కారణంగా గత కొన్ని నెలల్లో ముర్షిదాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల మంది ఓటరు కార్డు కోసం, తప్పులు సరిచేయడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వాటిని సరిచేసే పనిలో సిబ్బంది తలమునకలై ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుందని ఫరక్కా బీడీఓ రాజర్షి చక్రవర్తి తెలిపారు. ఏప్రిల్ లోగా సునీల్‌కి కొత్త ఓటర్ కార్డు అందిస్తామని, ఈ పొరపాటుకు కారణమైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసు పంపినట్లు చక్రవర్తి చెప్పారు.

Tags: Election Card, Dog Photo, Correction, CRC, NRC, CAA, Voter Card

Advertisement

Next Story

Most Viewed