- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సపోటా వల్ల ప్రయోజనాలు
దిశ, వెబ్‌డెస్క్: సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. సపోటా పండ్లు తియ్యగా ఉంటాయి. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడంతో శరీరానికి శక్తిని అందిస్తుంది. సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
సపోటాలో పిండిపదార్థాలు పుష్కలంగా ఉండడంతో శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ అందిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్-A కంటికి ఎంతో మేలు చేస్తుంది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉంటాయి.దీనిలో ఉండే ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది. ఇక జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా ఎంతో ఉపయోగపడుతుంది. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ ఉపయోగపడుతుంది.
సపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి. గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు సపోటా జ్యూస్ తాగేవారికి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సపోటా పండు నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించడంలోనూ ఉపయోగపడుతుంది.