జాన్వీ కపూర్‌ను ట్రై చేస్తున్న బెల్లంకొండ

by Anukaran |   ( Updated:2021-01-02 05:56:56.0  )
జాన్వీ కపూర్‌ను ట్రై చేస్తున్న బెల్లంకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ అనిపించేందుకు సిద్ధమయ్యాడు. ఆ తర్వాత బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్‌(ఛత్రపతి రీమేక్) షూటింగ్ మొదలుపెట్టనున్న బెల్లంకొండ.. ప్రస్తుతం హీరోయిన్ ఎంపికలో బిజీగా ఉన్నాడు. తన సినిమాల్లో ఎప్పుడూ స్టార్ హీరోయిన్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చే కుర్ర హీరో.. బాలీవుడ్ ఎంట్రీ కోసం యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్‌ను చూజ్ చేసినట్లు తెలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తన సినిమాలో ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ చేయాలని ఫిల్మ్ మేకర్స్‌ను కోరినట్లు సమాచారం. కాస్టింగ్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. కొడుకు కోరిక మేరకు తండ్రి బెల్లంకొండ సురేష్ జాన్వీని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరి బెల్లంకొండ అప్రోచ్‌కు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాకు వి.వి.వినాయక్ దర్శకులు.

Advertisement

Next Story