- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో రీమేక్‌కు సిద్ధమైన బెల్లంకొండ.. రీచ్ కాగలడా?
దిశ, సినిమా: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమిళ్ మూవీ ‘రాక్షసన్’ రీమేక్ ‘రాక్షసుడు’తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తన కెరియర్‌లోనే బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న బెల్లంకొండ.. ఆ తర్వాత ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను పెన్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా ఇప్పుడు ముచ్చటగా మూడో రీమేక్ ప్రకటించాడు బెల్లంకొండ. కోలీవుడ్‌లో ఇటీవలే రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘కర్ణన్’ సినిమా స్క్రిప్ట్, ఎగ్జిక్యూషన్‌కు ‘అల్లుడు శీను’ ఫిదా అయిపోయాడట.
సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. కాగా ఈ సినిమాలో ధనుష్ మైండ్ బ్లోయింగ్ పర్‌ఫార్మెన్స్‌కు సరెండర్ అయిపోయిన శ్రీనివాస్.. తెలుగులో రీమేక్ చేసేందుకు డిసైడ్ అయ్యాడని తెలుస్తుండగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు. అయితే ‘కర్ణన్’లో ధనుష్ మరో నేషనల్ అవార్డు పర్‌ఫార్మెన్స్ ఇవ్వగా.. మరి ఈ కుర్ర హీరో ఆ లెవల్‌ను రీచ్ కాగలడా అని అనుమానిస్తున్నారు సినీ లవర్స్.