- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లాల్ మర్డర్ కేసు 25 ఏళ్ల కిందటి పగ.. తండ్రికి విషమిచ్చారని..!
దిశప్రతినిధి, నిజామాబాద్ : తాను చిన్నగా ఉన్నప్పుడే తన తండ్రికి విషం ఇచ్చి చంపారని తెలిసి అది మనస్సులో పెట్టుకుని పెద్దయ్యాక పెద్దనాన్న పిల్లలను మట్టుబెట్టాడు. పాతికేళ్ల పగను కేవలం ఈతరాదని గుర్తించి నీటిలో తోసి వేసి మరీ పగ తీర్చుకున్నాడు. ఫ్యాక్షన్‌కు ఏమి తీసిపోని ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసి పేటకు చెందిన నర్సింలు(32), శివ(28) ఇద్దరు అన్నదమ్ములు. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోశించుకుంటున్నారు. వారం రోజుల క్రితం వారి బాబాయి కొడుకు చిన్న వెంకట్‌తో వీరిద్దరికి గొడవ జరిగింది. అప్పుడు శివను చిన్న వెంకటి చితకబాదాడు. తర్వాత అందరూ పిలిచి గొడవవద్దని సర్ధిచెప్పారు.
కానీ తన తండ్రిని తాను చిన్నగా ఉన్నప్పుడే పెద్దనాన్న కుటుంబం విషం ఇచ్చి చంపిందని వారిపై పగతో రగిలిపోయాడు చిన్న వెంకట్. సోమవారం మధ్యాహ్నం పెద్దనాన్న కొడుకులైన నర్సింలు, శివలను తీసుకుని వెళ్ళి బెల్లాల్ చెరువు వద్ద ఉన్న కల్లు బట్టిలో ముగ్గురు కల్లు సేవించారు. అక్కడి నుంచి చెరువు వద్ద చీప్ లిక్కర్ తాగుదామని తీసుకెళ్లాడు. పథకం ప్రకారం ఇద్దరికి పూటుగా మద్యం తాగించాడు. అనంతరం మత్తులో చెరువు పక్కన మూత్రవిసర్జన కోసం వెళ్లిన శివను చెరువులోకి తోసేశాడు. ఈత రాని శివ నీటిలో మునిగిపోయాడు. తర్వాత అన్న నర్సింలు వద్దకు వచ్చి చిన్నవాడు శివ నీటిలో మునిగిపోతున్నాడని తీసుకువచ్చాడు. ఇద్దరికి ఈత రాదని తెలిసి ముందుగా అన్నను నర్సింలు కూడా శివను కాపాడాలని పురమాయించి తోసేశాడు.
ఆ తర్వాత తాపీగా రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. రాత్రికి ఇంటికి చేరుకున్న చిన్న వెంకటి మిగిలిన ఇద్దరి కొరకు వాకబు చేయకుండా వెళ్లిపోయాడు. మృతుల కుటుంబ సభ్యుడైన పెద్ద వెంకటి రాత్రి బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చివరకు చిన్న వెంకటిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను నర్సింలు, శివలను బెల్లాల్ చెరువులో తోసేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. మంగళవారం చిన్న వెంకట్‌ను అదుపులోకి తీసుకుని చెరువులో ఉదయం రెండు శవాలను వెలికి తీయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాకాసీ పేట్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు లేబర్ పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే కావడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి.