ఒలంపిక్స్‌లో విచిత్రం : అథ్లెట్ల శృంగారాన్ని అడ్డుకునే కొత్తరకం బెడ్లు!

by Anukaran |   ( Updated:2021-07-19 03:27:42.0  )
tokyo olampics
X

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలంపిక్స్ కి ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. జులై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న ఈ క్రీడల కోసం నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక కరోనా తో ఈ క్రీడలు ప్రశ్నార్థకంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అథ్లెట్ల మధ్య శృంగార కట్టడికి నిర్వాహకులు వినూత్న ఆలోచనను అమలుపరుస్తున్నారు. కరోనా సమయంలో క్రీడాకారులు ఎవరూ శృంగారంలో పాల్గొనకుండా వారు బస చేస్తున్న గదులలో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు. ఒలంపిక్ గ్రామంలో ఉన్న ఈ గదులలో బెడ్లను అట్టలతో తయారుచేశారు.

కార్డు బోర్డు అట్టతో తయారుచేసిన ఈ బెడ్లు ఒక్కరికంటే ఎక్కువ బరువును మోయలేవు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదు. ఒకవేళ కాదు, కూడదు అని ప్రయత్నిస్తే.. అవి విరిగి ఆటగాళ్లు కిందపడతారు. ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ బెడ్ గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, జూలై24 న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలంపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయంటూ ఒలింపిక్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed