అనుమానాస్పద స్థితిలో బీఈడీ కాలేజీ లెక్చరర్ మృతి..

by Shyam |   ( Updated:2021-11-29 04:04:44.0  )
అనుమానాస్పద స్థితిలో బీఈడీ కాలేజీ లెక్చరర్ మృతి..
X

దిశ, మర్రిగూడ: మండల కేంద్రంలోని ఎంజీఆర్ బీఈడీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న సంగేపు వెంకటేశం( 39) సోమవారం తెల్లవారుజామున వట్టిపల్లి చౌరస్తాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చౌరస్తా కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశం సాయంత్రం మిత్రులతో కలిసి వెళ్లి మరునాడు ఉదయం వరకు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అక్కడి పరిసర ప్రాంతాల వాళ్లు, కుటుంబ సభ్యులకు మృతి చెందిన సమాచారం అందించడంతో భార్య, తల్లి, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ నాగుల్ మీరా కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story