బీ అలర్ట్.. హైదరాబాద్‌లో వాటి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్

by Shyam |
Whatsapp logo
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : జంటనగరాలలోని నాలాలలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలలో పూడిక తొలగింపు పనుల కోసం ప్రభుత్వం రూ 45 కోట్లు కేటాయించిందని తెలిపారు. పూడిక తొలగింపు పనుల పురోగతి పై ఈ నెల 11 వ తేదీన అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం లో వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో నాలా లను సందర్శించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారని పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారని చెప్పారు. నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, జంక్షన్ ల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాలా లలో పూడిక తొలగింపు పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ఈ నెల 14 నుండి 19 వ తేదీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేటర్ లు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నాలా లను సందర్శించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు వివరించారు.

14 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు తాను అధికారులతో కలిసి బేగంపేట నాలా ను సందర్శించనున్నట్లు ప్రకటించారు. నాలా ల పూడిక తొలగింపు కు సంబంధించిన ఫిర్యాదులను ఫోటోలు, నాలా ప్రాంతం పేరు, సంబంధిత వ్యక్తి సమాచారం వాట్సప్ గ్రూప్ కు పంపించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. నేరుగా పిర్యాదు చేయదలచిన వారు నెంబర్ 9848282309 కు చేయాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story