- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలం సెలవుల్లో యూట్యూబ్ వ్యవసాయం
ఇప్పటివరకు వేసవి సెలవులు వచ్చేవి, కరోనా వల్ల ప్రస్తుతం వేసవి సెలవులతో పాటు వర్షాకాలం సెలవులు కూడా వచ్చాయి. వేసవిలో సెలవులొచ్చినా.. ఎండ తీవ్రతకు ఏం చేయలేని పరిస్థితి ఉండేది. కాబట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులందరూ ఇంట్లోనే సేద తీరేవారు. ఇక లాక్‌డౌన్ టైమ్‌లో సినిమాలు, టీవీ షోలు చూస్తూ సేదతీరారు. పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడి చాలా మందికి బోర్ కొట్టింది. ఎలాగూ పరీక్షలు కూడా రద్దయ్యాయి. మళ్లీ సాధారణ రోజులు ఎప్పుడొస్తాయో తెలియదు. బయట తిరగడానికి అవకాశం ఉన్నా కరోనా కేసులు పెరుగుతున్న భయంతో ఇంట్లో నుంచి వెళ్లలేం. మొన్నటి వరకు ఊళ్లల్లో యువత ఉపాధి పనికి కూడా వెళ్లగా.. వర్షాలు మొదలవడంతో ఇప్పుడు అది కూడా లేదు.
అయితే, ఆ వర్షపు చినుకుల్లోనే కావాల్సినంత పని వెతుక్కోవచ్చు. ఆ పని చేయడానికి యువతకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. కానీ ఇప్పుడొచ్చింది. అవును.. ఎలాగంటారా? అదే వ్యవసాయం. ఏదో పెద్ద మొత్తాల్లో పంటలు పండించి అమ్మాలని చెప్పట్లేదు కానీ, ఇంటి అవసరాలకు సరిపడా సాగు చేసినా చాలు. ఎలాగూ ఎక్కువ మంది పల్లెల్లోనే ఉంటున్నారు కాబట్టి ఆకుకూరలు, కూరగాయలు, పూల చెట్లు వంటివి పెంచుకోవచ్చు. అందుకోసం మనకు సాయం చేయడానికి మన పెద్దదిక్కు చాలా ఉపయోగపడుతోంది. అదేనండీ.. యూట్యూబ్. లాక్‌డౌన్‌లో మొదట్లో యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలు ప్రయత్నించారు కదా.. ఇప్పుడు అదే యూట్యూబ్ సాయంతో వ్యవసాయం కూడా చేసేయండి.
ఇంటి అవసరాల వరకు ఏ మొక్కలు పెంచాలి, వాటిని ఎలా సంరక్షించాలి, ఏ గింజలు ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా నాటాలి? వంటి ప్రశ్నలన్నింటికీ యూట్యూబ్‌లో సమాధానం దొరుకుతుంది. వీడియోలు ఇంగ్లీష్‌లో ఉంటాయేమోనని అస్సలు కంగారు పడనక్కర్లేదు. అనుభవం లేని వాళ్లు ఏదో చెప్తే అవి అనుసరించడం మంచిదేనా అనే అనుమానం కూడా వద్దు. ఎందుకంటే, ఈ వీడియోలన్నీ తెలుగులోనే ఉంటాయి. అలాగే ఇంటి పంటలు, చిన్న మొత్తాల్లో వ్యవసాయం చేసే అనుభవజ్ఞులైన గృహిణులే ఈ యూట్యూబ్ చానళ్లను నడుపుతున్నారు. ‘మ్యాడ్ గా బీ లైక్ బిందుర్డెనర్, కలగూరగంప, పట్నంలో పల్లె రుచులు బై పిన్నాక పద్మ, సామ్స్ కిచెన్ గార్డెనింగ్,..’ వంటివే అందుకు ఉదాహరణ. యూట్యూబ్ చానళ్లలో చిన్నమొత్తాల్లో వ్యవసాయం చేయగల చిట్కాలు, సలహాలు, సూచనలతో పాటు అప్పుడప్పుడు తమ సబ్‌స్క్రైబర్లకు బహుమతుల పేరుతో దేశీ విత్తనాలను, కూరగాయ గింజలను కూడా ఇస్తుంటారు. మరి ఇంకేం.. వానలు జోరు మీదున్నపుడే ఈ చానళ్ల ద్వారా ఎంతోకొంత నేర్చుకుని మీ వ్యవసాయ, గార్డెనింగ్ అభిరుచిని బయటపెట్టండి.