ఎంబీబీఎస్ సీటు రాలేదని..బీడీఎస్ నచ్చక యువతి ఆత్మహత్య

by Shyam |   ( Updated:2020-05-26 10:32:49.0  )
ఎంబీబీఎస్ సీటు రాలేదని..బీడీఎస్ నచ్చక యువతి ఆత్మహత్య
X

దిశ, రంగారెడ్డి: ఎంబీబీఎస్ సీట్ రాలేదని, బీడీఎస్ చదవడం ఇష్టం లేక మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని తాను నివాసముంటున్న14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ సమీపంలో గల అలేఖ్య టవర్స్‌లో 14వ అంతస్తులో ఉంటున్న రఘురాం, పద్మ దంపతుల కుమార్తె సాహితీ(25) ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. తనకు ఎంబీబీఎస్ సీట్ రాలేదని, ప్రస్తుతం బీడీఎస్ కోర్సుకు అంతగా డిమాండ్ లేదని చెబుతూ తరుచూ భాదపడుతూ ఉండేదని కుటుంబ సభ్యులు చెప్పారు.తండ్రి సికింద్రాబాద్‌లోని రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా, తల్లి ఇంటి వద్దే ఉంటుంది. వీరికి ఇద్దరు కూతుర్లు. ఈ క్రమంలోనే పెద్ద కూతురు సాహితీ మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం 14వ అంతస్తు బల్కానీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి కిందకు దూకింది. గమనించిన వాచ్‌మెన్ తల్లి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు కిందకు వచ్చి చూసే సరికి అప్పటికే ఆమె మృతి చెందింది. కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.సమాచారం అందుకున్న ఎల్బీనగర్ డీఐ దృష్టమోహన్, ఎస్ సుధాకర్లు ఘటనా స్థలికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.అనంతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed