BCCI ఆస్తుల విలువ రూ. 14,489 కోట్లు

by Shamantha N |
BCCI ఆస్తుల విలువ రూ. 14,489 కోట్లు
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ ఆస్తుల విలువ రూ. 14,489కి చేరినట్లు తెలుస్తున్నది. ఒక మీడియా ఏజెన్సీ కథనం మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బీసీసీఐ భారీగా ఆదాయాన్ని పెంచుకున్నదని.. ఆ ఏడాదిలో రూ. 2,597 కోట్లను అదనంగా తన ఆదాయానికి జమ చేసుకున్నట్లు తెలిపింది. సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిన బీసీసీఐ ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆరు నెలల లోపు అనుబంధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ, ఐసీసీకి వెల్లడించాల్సి ఉంది.

ఈ బ్యాలెన్స్ షీట్ పబ్లిక్ డొమైన్‌లో పెట్టకముందే ఐసీసీకి ముందే అందజేయాల్సి ఉంటుంది. అలా అందజేకపోతే ఐసీసీ నుంచి రావాల్సిన వాటా సొమ్ము బీసీసీఐ ఖాతాలో జమకాదు. అయితే గత ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచినా ఇంకా బ్యాలెన్స్ షీట్ బయటకు రాలేదు. కానీ గతంలో కంటే మరో రూ. 2,407 కోట్లు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తున్నది. బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్సిడ్ డిపాజిట్లు, ప్రాపర్టీలు, స్పాన్సర్ ఆదాయం, బ్రాడ్ కాస్టర్ హక్కుల ద్వారా ఈ సొమ్ము సమకూరినట్లు తెలుస్తున్నది. ప్రతీ ఏడాది బీసీసీఐ ఆదాయంలో సింహభాగం ఐపీఎల్ ద్వారానే వస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed