- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా టీ20 చాలెంజ్ వాయిదా?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీని బీసీసీఐ గత మూడుసీజన్లుగా నిర్వహిస్తున్నది. మహిళా ఐపీఎల్ ప్రారంభించే ఉద్దేశంతో సన్నాహకంగా టీ20 చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి కూడా టీ20 చాలెంజ్ నిర్వహిస్తామని ఐపీఎల్ షెడ్యూల్ టైంలో ప్రకటించింది.
కాగా, ఐపీఎల్ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడిచి పోయినా మహిళా టీ20 చాలెంజ్‌పై బీసీసీఐ నోరుమెదపడం లేదు. ఈ టోర్నీలో భారత మహిళ క్రికెటర్లతో పాటు పలు దేశాలకు చెందిన 12 మంది విదేశీ ప్లేయర్లు గత సీజన్‌లో ఆడారు. యూఏఈలో ప్రేక్షకులు లేకుండానే గత ఏడాది టీ20 చాలెంజ్ నిర్వహించారు. అయితే ఈ సారి విదేశీ క్రీడాకారిణులు రావడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పలు దేశాల నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో మహిళా క్రీడాకారిణులు వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ ఏడాదికి టీ20 చాలెంజ్‌ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి అహ్మదాబాద్‌లో ఈ ఏడాది టీ20 చాలెంజ్ నిర్వహించాలనుకున్న బీసీసీఐ కరోనా కారణంగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.