ఇంగ్లాండ్‌లో క్వారంటైన్ తగ్గించండి : బీసీసీఐ

by Shyam |
ఇంగ్లాండ్‌లో క్వారంటైన్ తగ్గించండి : బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : డబ్ల్యూటీసీ ఫైనల్, 5 మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియాకు క్వారంటైన్‌ను తగ్గించాలని ఈసీబీని బీసీసీఐ కోరింది. టీమ్ ఇండియా క్రికెటర్లకు ఇండియాలోనే బయోబబుల్ ఏర్పాటు చేసి కొన్ని రోజులు ఉంచుతామని.. బబుల్ నుంచి నేరుగా ఇంగ్లాండ్ వస్తారని.. కాబట్టి అక్కడ 10 రోజుల క్వారంటైన్‌ను తగ్గించాలని కోరింది. ప్రస్తుతం ఇండియా నుంచి వెళ్లే ప్రతీ ఒక్కరినీ ఇంగ్లాండ్‌లో ప్రభుత్వ క్వారంటైన్ హోటల్స్‌లో 10 రోజుల పాటు ఉంచుతున్నారు. అయితే బయోబబుల్ నుంచి వచ్చే టీమ్ ఇండియా క్రికెటర్లకు సడలింపు ఇవ్వాలని బీసీసీఐ కోరుతున్నది. మే రెండు లేదా మూడో వారంలో టీమ్ ఇండియా క్రికెటర్లు బయోబబుల్‌లోకి వెళ్లనున్నారు.

Advertisement

Next Story