ఐపీఎల్ సమయంలో 20వేల కరోనా టెస్టులు చేయనున్న వీపీఎస్

by Shyam |
ఐపీఎల్ సమయంలో 20వేల కరోనా టెస్టులు చేయనున్న వీపీఎస్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో బయోబబుల్ వాతావరణంలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో 20 వేల కొవిడ్ టెస్టులు(Covid Tests) నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ(BCCI) అబుదాభికి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్‌ను ఏజెన్సీగా నియమించింది. ఐపీఎల్ జరిగే మూడు నెలల పాటు ఆటగాళ్లు, సిబ్బంది, యాజమాన్యం, బీసీసీఐ అధికారులు, మ్యాచ్ అఫిషియల్స్(Match officials) ఇలా అందరికీ పలుమార్లు టెస్టులు నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఐపీఎల్ సీజన్ అంతా ఈ సంస్థే రక్షణ పరికరాలు, పీపీఈ కిట్లు వంటివి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బయో బబుల్‌కు వెళ్లడానికి ముందు మూడు సార్లు ఆటగాళ్లకు, సిబ్బందికి టెస్టులు చేయనున్నట్లు వీపీఎస్ స్పష్టం చేసింది. ఇక సీజన్ ప్రారంభమైన తర్వాత ప్రతీ ఐదు రోజులకు ఒకసారి టెస్టింగ్స్ నిర్వహించనున్నట్లు వీపీఎస్ హెల్త్ కేర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story