- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంగూలీ, జై షా పదవుల కేసు వాయిదా
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐలో తీసుకొచ్చిన సంస్కరణలను మార్చాలని కోరుతూ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం మూకుమ్మడిగా తిరస్కరించింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ రాజ్యాంగంలో పలు మార్పులు చేశారు. దీనిని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీసీసీఐ సహా పలు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు పలు సవరణలు సూచిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. రాజ్యాంగ సవరణలకు సంబంధించి రాష్ట్రాలు పిటిషన్లు వేయడానికి అర్హత కలిగిలేవని.. కేవలం బీసీసీఐ పిటిషన్‌ను మాత్రమే విచారిస్తామని పేర్కొంది. అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలానికి సంబంధించి బీసీసీఐ పిటిషన్లో పేర్కొన్నది.
వరుసగా ఆరేళ్ల పాటు ఏ వ్యక్తి బోర్డు పదవిలో ఉండకూడదు అనేది కీలకం. గతంలోనే గంగూలీ, జై షా తమ పదవీకాలం ముగించుకున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 3వ వారానికి వాయిదా వేసింది. దీంతో వీరిద్దరికి మరి కొంత కాలం పదవుల్లో ఉండే అవకాశం లభించింది. ఈ నెల 24న జరిగే బీసీసీఐ వార్షిక సభ్య సమావేశాన్ని గంగూలీ అధ్యక్షతతోనే నడిపిస్తారని తెలుస్తున్నది. ఇందులో జై షాతో పాటు జార్జ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నది.