IPL మిడ్-సీజన్ ఆటగాళ్ల బదిలీలు

by Shyam |
IPL మిడ్-సీజన్ ఆటగాళ్ల బదిలీలు
X

దిశ, స్పోర్ట్స్ :

ఐపీఎల్ సీజన్ 13లో అన్ని జట్లు 7 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. దీంతో IPL నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మిడ్-సీజన్ బదిలీలకు BCCI అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి 5 రోజుల పాటు ఆటగాళ్ల బదిలీలకు అవకాశం కల్పిస్తామని బీసీసీఐ ఫ్రాంచైజీలకు వెల్లడించింది. దీనికి కొన్ని నియమ నిబంధనలు కూడా రూపొందించింది. ఆటగాడు ఈ సీజన్‌కు మాత్రమే బదిలీ అవుతాడు. వేలంలో సదరు ఆటగాడిని ఏ జట్టైతే కొనుగోలు చేసిందో.. అదే ఫ్రాంచైజీకి చెందిన వాడిగా IPL గుర్తిస్తుంది.

ఏ ఆటగాడినైనా ఇతర ఫ్రాంజైజీలు తీసుకుంటే.. ఈ సీజన్‌లో అతడి అసలైన జట్టుతో జరిగే మ్యాచ్‌లో ఆడకూడదు. ఉదాహరణకు చెన్నైకి చెందిన ఇమ్రాన్ తాహిర్‌ను ఢిల్లీ జట్టు కనుక తీసుకుంటే.. ఢిల్లీ-చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో అతడు ఆడే వీలుండదు. ఈ ఆటగాళ్ల బదిలీ పూర్తిగా ఇరు ఫ్రాంచైజీ మధ్య జరిగే ఒప్పందం మాత్రమేనని బీసీసీఐ తెలిపింది.

ఇప్పటి వరకు జట్టు తరపున 2 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ అనుమతికి మాత్రమే బీసీసీఐ అంగీకరిస్తుంది. అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ బదిలీకి అవకాశం ఉండదు. కాగా, మంగళవారం ఆటగాళ్ల బదిలీ ప్రారంభమైనా ఇంకా ఏ ఫ్రాంచైజీ కూడా ఒప్పందాలు ప్రారంభించలేదు. రహానేను సీఎస్కే జట్టు తీసుకుంటుందనే వార్తలు వచ్చాయి. కాగా.. తాము రహానేను వదులుకోబోమని.. అతడు మా జట్టులో కీలక సభ్యుడని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed