- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ మెగా వేలం రద్దు?
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 14కు ముందు జరగాల్సిన ఆటగాళ్ల మెగా వేలాన్ని(mega auction) బీసీసీఐ (bcci) రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 2021 మార్చి-ఏప్రిల్‌లో జరగాల్సిన ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు(franchises) కొత్త ఆటగాళ్లను కొనుక్కోవలసి ఉంది.
ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లను పూర్తిగా మార్చివేయడం, ఎవరెవరిని తమతో కొనసాగిస్తారో (రిటైన్) ముందుగా తెలపాల్సి ఉంటుంది. 2021 కోసం వేలం జరిగితే చాలా ఫ్రాంచైజీల రూపురేఖలే (appearance) మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే, కరోనా (kovid-19) కారణంగా ఈ ఏడాది సీజన్ ఆలస్యంగా(dely) సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరుగనుంది. ఐపీఎల్ 13 ముగిసిన అనంతరం తర్వాత సీజన్‌కు 4నెలల సమయమే ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీలకు వేలం కోసం సమాయత్తం కావడానికి సమయం చాలదు.
ఈ వేలంలో కొనే ఆటగాళ్లతోనే రాబోయే మూడు, నాలుగు సీజన్లు ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి వేలంపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈసారి వేలాన్ని(auction) వాయిదా వేయడానికే బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ అభిప్రాయంతో ఫ్రాంచైజీలు(franchises) కూడా ఏకీభవించాయి. తమ ప్రస్తుత ఆటగాళ్లతోనే తర్వాతి సీజన్ కూడా ఆడతామని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఐపీఎల్ 2021 రద్దుకు (cancellation)కూడా కొన్ని ఫ్రాంచైజీలు ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. అయితే, ప్రస్తుతం యూఏఈ(UAE)లో జరుగనున్న సీజన్ ముగిసిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు