కామెంటేటర్ మంజ్రేకర్‌పై బీసీసీఐ కొరడా

by Shyam |
కామెంటేటర్ మంజ్రేకర్‌పై బీసీసీఐ కొరడా
X

ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి అతనికి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ధర్మశాలలో గురువారం జరగాల్సిన వన్డే మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు మంజ్రేకర్ మినహా మిగతా కామెంటేటర్స్ హాజరు అయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై ఓ ఆంగ్ల పత్రికలో ప్రధాన కథనం వెలువడింది. అయితే అసలు కారణం ఏంటన్నది తేలియాల్సి ఉంది. మంజ్రేకర్ పనితీరు బీసీసీఐ పెద్దలకు నచ్చలేదని సదరు పత్రిక కథనంలో పేర్కొంది. ఇటీవల రవీంద్ర జడేజా, హర్షాబోగ్లే‌లపై చేసిన వ్యాఖ్యలతో భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు మంజ్రేకర్. దీంతో అతనిపై బీసీసీఐ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Tags: comentetor, Sanjay Manjrekar, cricket, bcci

Next Story

Most Viewed