ఇప్పటి వరకు మా ఆయనతో నాకు శృంగారంలో తృప్తి కలగలేదు

by Bhoopathi Nagaiah |
ఇప్పటి వరకు మా ఆయనతో నాకు శృంగారంలో తృప్తి కలగలేదు
X

డాక్టర్‌ గారూ.. నా పెళ్లై కొన్ని నెలలవుతోంది. నేను ఇంతవరకూ మా ఆయనతో సెక్స్ అనుభవాన్ని సంతృప్తిగా పొందలేదు. కారణం నా యోని లోపల అడ్డంగా ఏదో గడ్డలా తగులుతుందని మావారు అంటున్నారు. చిన్నప్పుడు నాకు నడుము వద్ద దెబ్బ తగలడం వల్ల ఇలా యోనిలో అడ్డు ఏర్పడిందా ? నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. నాకున్న ఈ సమస్యకు మందులు వాడితే సరిపోతుందా? లేక ఆపరేషన్‌ చేయించుకోవాలా? పరిష్కారం చెప్పండి. - కె.ఆర్‌. నిజామాబాద్‌

నీకు నెలసరి క్రమం తప్పకుండా వస్తుందన్నావు. కాబట్టి ఈ సమస్యకు కారణం యోనిలో నీవన్నట్లు గడ్డకాదు. బహుశ.. యోనికడ్డంగా ఎక్కిన భాగం ఉండే హైమన్‌ పొర లేదా పూర్తిగా కప్పబడి రంధ్రాలతో తెరచుకున్న హైమన్‌ ఉండచ్చు. అలాగే కలయిక వేల భయాందోళనలతో యోని కండరాలు బిగుసుకుపోయి, రంద్రం పూర్తిగా మూసుకుపోతే కలయిక దుర్లభం అవుతుంది. పెళ్లయిన కొత్తలో తొంభైశాతం మంది స్త్రీలలో ఇలాంటిదే జరుగుతుంది. దీన్ని ‘వాగినిసమ్స్‌’ అంటారు. నువ్వు ఒకసారి గైనకాలజిస్టు వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకో. ఒకవేళ అది హైమన్‌ పొర వల్లనే అయితే ‘హైనెక్టమీ’ అనే చిన్న ఆపరేషన్‌ చేస్తారు. అలా కాకపోతే సెక్సాలజిస్టును సంప్రదిస్తే ఆందోళన తగ్గించే విధంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి కండరాలు బిగుసుకుపోకుండా రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు నేర్పిస్తారు. దంపతులిద్దరూ సెక్సాలజిస్టును కలవాలి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story

Most Viewed