సూర్య V/s కార్తీ వార్.. ఆ పండుగకి పోటా పోటీగా రాబోతున్న అన్నదమ్ములు

by sudharani |
సూర్య V/s కార్తీ వార్.. ఆ పండుగకి పోటా పోటీగా రాబోతున్న అన్నదమ్ములు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య (Surya) ప్రస్తుతం ‘రెట్రో’(Retro) మూవీతో బిజీగా ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీతో పాటు ఈ స్టార్ హీరో తన 45వ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ ఏప్రిల్ 14కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే ఈ సినిమాను దివాళీ స్పెషల్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలను సమాచారం.

ఇదిలా ఉంటే.. సూర్య తమ్ముడు యంగ్ హీరో కార్తిక్ శివకుమార్ (Karthik Shivakumar) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్-2’(Sardar-2). ఈ సినిమా ‘సర్దార్’ కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పీఎస్ మిత్రన్ (P.S. Mithran)దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్(Malavika Mohanan), అషికా రంగనాథ్ (Ashika Ranganath)హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ మూవీని కూడా దివాళీ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ప్రజెంట్ ఈ రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్ వార్త ప్రజెంట్ నెట్టింట హాట్ హాట్ వైరల్ కావడంతో.. కోలీవుడ్‌లో సూర్య V/s కార్తీ వార్ నడవనుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు మాత్రం అప్పుడే సూర్య45 రిలీజ్ అయ్యే అవకాశాలు లేదంటూ చెప్పుకొస్తున్నారు.



Next Story