- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులు ఖరారు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ మహిళా క్రికెటర్ల ఏడాది కాంట్రాక్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 2020 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు ఈ కాంట్రాక్టు వర్తిస్తుందని బోర్డు తెలిపింది. టీనేజ్ సెన్సేషనల్ షెఫాలీ వర్మకు సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌కు ప్రమోషన్ లభించింది. మరోవైపు పూనవ్ రౌత్, రాజేశ్వరీ గైక్వాడ్‌లు కూడా సీ నుంచి బీకి ప్రమోషన్ పొందారు. టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌లను ఏ కేటగిరీలోకి చేర్చారు. టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ బీ కేటగిరీలో ఉండటం గమనార్హం. పలు క్రికెటర్ల వేతనాలు ఇలా ఉన్నాయి.
ఏ గ్రేడ్ (రూ. 50 లక్షలు)
హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనవ్ యాదవ్
బి గ్రేడ్ (రూ. 30 లక్షలు)
మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేవ్వరీ గైక్వాడ్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్
సి గ్రేడ్ (రూ. 10 లక్షలు)
మాన్సి జోషి, అరుంధతి రెడ్డి, పూజ వస్త్రాకర్, హర్లీద్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్