- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీసీబీ దూకుడుకు బీసీసీఐ చెక్
దిశ, స్పోర్ట్స్: ‘ఐపీఎల్ వంటి ఒక దేశవాళీ లీగ్ కోసం టీ20 వరల్డ్ కప్ వాయిదా వేస్తారా? షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్ జరుగుతుంది. ఆరు నూరైనా ఐపీఎల్ జరగనివ్వం’ ఇవీ బీసీసీఐని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చేసిన వ్యాఖ్యలు. ఐపీఎల్ అంటే ఇంతెత్తున లేస్తున్న పీసీబీ, బీసీసీఐని దెబ్బ కొట్టడానికి దొరికిన అవకాశాలు ఏవీ వదులుకోవడం లేదు. కొన్ని రోజులుగా పీసీబీ చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పెడుతూ బీసీసీఐ ఎదురుదాడికి దిగింది.
ఆసియా కప్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) రెండూ జరగడం అసాధ్యం. ఆసియాకప్ నిర్వహించాలనుకుంటే పీఎస్ఎల్‌ను వాయిదా వేసుకోమని పీసీబీకి బీసీసీఐ సూచించింది. మేం ఐపీఎల్‌ను మాకు తగిన సమయంలో నిర్వహించుకుంటాం. నవంబర్‌లో పీఎస్ఎల్ నిర్వహించి అంతకు ముందు ఆసియాకప్ నిర్వహించాలనుకుంటే మాకు షెడ్యూల్ కుదరదు. ఆసియాకప్ నిర్వహించాలనుకుంటే మీరు పీఎస్ఎల్ వదులుకోవాల్సిందేనని ఖరాఖండీగా చెప్పేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేమని, స్పష్టత వస్తేనే తాము దానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.