బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ

by Shyam |
బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ స్టడీ సర్కిల్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణనిచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని డైరెక్టర్ ఎన్. బాలాచారి తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌, యూపీఎస్‌సీ తదితర పోటీ పరీక్షల కోసం ఫౌండేషన్‌ కోర్సును ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణనివ్వనున్నట్టు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల కుటుంబాల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ. 2లక్షలు మించకుండా ఉండాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం 040-24071178, 6302427521కు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story