తెలంగాణ పోలీసు వ్యవస్థ నిద్రపోతోంది.. తల్లోజు ఆచారీ ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-06-28 02:41:42.0  )
BC Commission member Talloju Achari
X

దిశ, కల్వకుర్తి: ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన మరియమ్మ అనే మహిళ లాకప్ డెత్ ఘటనపై జాతీయ కమిటీ సభ్యులు ఆచారి డీజీపీ మహేందర్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తేరుకొని చర్య తీసుకునే వరకు డీజేపీ స్పందించక పోవడంపై ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక అతిథిగృహంలో ఆచారి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా డీజీపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ఫెండ్లీ పోలీసింగ్ ఎక్కడా కనిపించడం లేదని, సామాన్య, మధ్య తరగతి ప్రజలు పోలీసులను చూసి నేటికీ భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. రాష్ర్టంలో రిపోర్టర్లపై కూడా దాడులు పెరిగిపోయాయని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా వ్యత్యాసం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పేదల ఇల్లు కూలగొట్టడంలో ఉన్న శ్రద్ధ వారికి డబుల్ బెడ్ రూమ్ కట్టించి ఇచ్చే దానిలో లేదని దుయ్యబట్టారు. ఒకపక్క కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం పట్టణంలో వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా వారి ఇళ్లను కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలవాల్సిన అధికారులు కూడా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ బీసీ కమీషన్ అక్రమాలకు పాల్పడుతున్న అందరిపై చర్యలు తీసుకుంటుందని ఆచారీ హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed