రెచ్చిపోయిన ‘భవానీ’ బార్ యాజమాన్యం.. కస్టమర్లను రోడ్డుపైకి ఈడ్చి చితకబాదారు

by Sumithra |
రెచ్చిపోయిన ‘భవానీ’ బార్ యాజమాన్యం.. కస్టమర్లను రోడ్డుపైకి ఈడ్చి చితకబాదారు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భవానీ రెస్టారెంట్ అండ్ బార్ యాజమాన్యం కస్టమర్లపై దాడులకు తెగబడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ బిల్లు విషయంలో వివాదం చెలరేగడంతో బార్ సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడినట్టు సమాచారం. డబ్బులు చెల్లించలేదని వీధిరౌడీల్లా బార్ యాజమాన్యం వ్యవహరించిందని కస్టమర్లు చెబుతున్నారు.

అందులో పనిచేసే యువకులు కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్టు బాధిత కస్టమర్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ముగ్గురు కస్టమర్లు తీవ్రంగా గాయపడగా.. వారికి కొట్టుకుంటూ రోడ్డుపైకి ఈడ్చుకొచ్చినట్టు తెలిసింది. అక్కడ పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బార్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed