కేసీఆర్ నమ్మినబంటు బట్టి జగపతికి కీలక పదవి

by Shyam |
కేసీఆర్ నమ్మినబంటు బట్టి జగపతికి కీలక పదవి
X

దిశ, మెదక్ : సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తి మూడు పర్యాయాలు మెదక్ మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగిన బట్టి జగపతిని మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నర్సాపూర్ నియోజక వర్గం కొల్చారం మండలానికి చెందిన మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డిని ఉపాధ్యక్షురాలుగా నియమించారు.

మరో 13 మందిని డైరెక్టర్లుగా నియమించారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చండ్రాపాల్, మెదక్ సహకార సంఘం అధ్యక్షుడు చిలుముల హన్మంత రెడ్డిలు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా బట్టి జగపతి మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. అంతేకాకుండా సాప సాయిలు, కుమ్మరి బాలయ్య, కండేల నర్సింహులు, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ చందర్, మేడిశెట్టి శంకర్‌తో పాటు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, డాక్టర్‌ ఉంటారు.

Advertisement

Next Story