- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎల్బీడబ్ల్యూ నిబంధనలు మార్చాల్సిందే’
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆటలో ప్రస్తుతం ఉన్న లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ) నిబంధన సరిగా లేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బంతి పిచ్ అయిన ప్రదేశంతో పాటు ప్యాడ్లను ఎక్కడ తాకుతుందో చూసి ఔట్ ఇస్తుండగా.. దీనివల్ల బౌలర్‌కు అన్యాయం జరుగుతోందని అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చాపెల్.. ఎల్బీడబ్ల్యూ నిబంధనలపై పలు సూచనలు చేశాడు. బ్యాట్స్‌మన్ ధరించే ప్యాడ్లు కాలికి దెబ్బ తగలకుండా రక్షణ కోసమే తప్ప అవుటవకుండా కాపాడటానికి కాదని చాపెల్ వెల్లడించాడు. బంతి బ్యాట్‌కు తగలకుండా కేవలం ప్యాడ్లకు తగిలినప్పుడు.. బంతి పిచ్ అయిన ప్రదేశంతో సంబంధం లేకుండా, ఆ బంతి వికెట్లను తాకుతుందని అంపైర్లు భావిస్తే అవుటివ్వాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ‘బ్యాట్స్‌మన్ షాట్ ఆడకుండా బంతిని వదిలేసిన స్థితిలో ప్యాడ్లకు తగిలితే అవుటిస్తూ.. షాట్ ఆడేందుకు ప్రయత్నించినపుడు మాత్రం అవుటివ్వకపోవడం అన్యాయమన్నాడు. ఆ బంతిని బ్యాట్స్‌మన్ ఏ కోణంలో ఆడాలని ప్రయత్నించాడో చూసి బంతి గమనాన్ని అంపైర్ అంచనా వేయడం సరికాదని చాపెల్ చెబుతున్నాడు. అసలు బ్యాట్స్‌మన్‌తో సంబంధం లేకుండానే ఎల్బీడబ్ల్యూ నిర్ణయం ఉండాలని సూచిస్తు్న్నాడు. ఇది ఒక రకంగా బ్యాట్స్‌మన్‌ను అసంతృప్తికి గురిచేయవచ్చు. కానీ ఆట యొక్క స్ఫూర్తిని మాత్రం మరింతగా పెంచుతుందని’ అన్నాడు.