- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిక్స్ కొట్టి బాధపడిన క్రికెటర్
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ అంటే బ్యాట్స్‌మాన్ ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. బౌండరీలు, సిక్సులు బాదుతూ బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు. సిక్సు కొట్టి చాలా సంతోషిస్తాడు. కానీ ఒక క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మాన్ బాధపడ్డాడు. దాని వెనుక ఒక కారణం ఉంది. అసిఫ్ అలీ అనే యువ క్రికెటర్ ఇంగ్లాండ్‌లోని ఇల్లింగ్‌వర్త్ సెయింట్ మేరీస్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతుంటాడు. ఆదివారం వెస్ట్ యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అలీ భారీ షాట్ కొట్టగా అది సిక్స్ వెళ్లింది. అయితే ఆ బాల్ నేరుగా స్టేడియంలో ఉన్న కార్ అద్దాలను బద్దలు కొట్టింది.
విచిత్రం ఏమిటంటే ఆ కార్ అసిఫ్ అలీదే. షాట్ కొట్టిన తర్వాత ఆ బంతి తన కారు వైపే వెళ్తుండటం గమనించిన అలీ ‘నో. నో.. నో’ అంటూ కేకలు పెట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఎప్పుడూ స్టేడియం బటయే కారు పార్క్ చేసే అలీ.. తొలి సారిగా లోపలకు తీసుకొని వచ్చాడు. కాగా, అలీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని సెయింట్ మేరీస్ క్రికెట్ క్లబ్ చైర్మన్ జెరెమీ రోడ్స్ అన్నారు. అలీకి ఆ కారే జీవనాధారం. అతడు ఒక ట్యాక్సీ డ్రైవర్ కావడం గమనార్హం