చైనాలో మళ్లీ గబ్బిలం మాంసం విక్రయాలు

by vinod kumar |
చైనాలో మళ్లీ గబ్బిలం మాంసం విక్రయాలు
X

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) జీవం పోసుకున్న చైనా దేశంలో తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అక్కడ విధించిన ఆంక్షలను ఒక్కొక్కిటిగా ఎత్తివేస్తోంది. అయితే ఈ వైరస్ ఇంత భారీ ఎత్తున ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసినా.. చైనాలో మాత్రం ప్రజలు సీ మార్కెట్లపై ఎగబడుతున్నారు. ముఖ్యంగా చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో జనం క్యూలు కట్టారు. దీనికి తోడు పలు రకాల జీవుల మాంసంతో తయారు చేసిన చైనా ఆయుర్వేద షాపులు సైతం రోడ్లమీద అనేకం దర్శనం ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. చైనాలో హుబే ప్రాంతంలోని వెట్ మార్కెట్లలోని వివిధ వన్య జంతువుల మాంసం, రక్తం కలవడం వల్లనే కొత్త రకం వైరస్
ఉద్భవించిట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ ఆందోళనలో పడ్డారు.

Tags : Bats meat, sales, again, China, corona virus



Next Story