- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూయార్క్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
దిశ, కాటారం: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను ఖండాంతరాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది నిర్వహించని వేడుకలు ఈ సారి రెట్టింపైన ఉత్సాహంతో మహిళలు బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వారాంతపు సెలవుల్లో ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో ఈ వేడుకలను నిర్వహిస్తూ సంస్కృతిని కొనసాగిస్తున్నారు. టి టి ఏ చాప్టర్ న్యూయార్క్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి న్యూయార్క్ లో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. దుర్గామాత విగ్రహానికి హారతులిచ్చి, లలితసహస్ర పారాయణం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలకు ప్రదర్శన నిర్వహించి అందంగా ఎత్తుగా పేర్చిన బతుకమ్మలను బహుమతులు పంపిణీ చేశారు. ఫారిన్ కల్చర్ కాకుండా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయ పద్ధతిలో కట్టుబొట్టు ఉన్న మహిళలు, బాలికలకు క్యాట్ వాక్ ప్రదర్శన నిర్వహించి విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి టీ ఏ అధ్యక్షుడు పటోలోల్ల మోహనే రెడ్డి, ఉపాధ్యక్షుడు వంశీరెడ్డి, వరంగల్ కరీంనగర్ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎన్నారైలు నాగే కుమార్, బాదం వేణు, గుంత లక్ష్మణ్ బిక్షపతి, సిరిపురం కృష్ణ, మహిళలు పాల్గన్నారు.