- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజూ స్నానం చేస్తే గుండె నొప్పి రాదంట
దిశ, వెబ్ డెస్క్: మీరు ఎక్కువ కాలం జీవించాలనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. మీరు ఈ అలవాటును రోజు వారీగా చేస్తే మీకు గుండె సంబంధిత వ్యాధులు మీ దరి చేరవు. దీంతో మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశముంది. అదేమిటో మీరే చూడండి.. అంతర్జాతీయ పత్రిక ఓ వార్త కథనాన్ని ప్రచురించింది. జపాన్ కు చెందిన పరిశోధకులు గుండె సంబంధిత రోగాలపై పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో రుజువైన అంశమేమంటే.. రోజూ టబ్ స్నానం చేస్తే గుండె నొప్పే కాదు.. గుండె సంబంధిత వ్యాధులేవీ కూడా దరి చేరవని తేల్చి చెప్పారు. వేడినీళ్ల స్నానం ప్రతిరోజూ చేస్తే ఎక్కువ రక్షణగా ఉంటందని పరిశోధనలో వాళ్లు కనుక్కొన్నారంట. వాళ్లు కొంతమందిని తీసుకుని అధ్యయనం ప్రారంభిస్తే.. వారిలో టబ్ స్నానం చేయనివాళ్లకే గుండె సంబంధిత వ్యాధులు ఎదురయ్యాయని, రోజూ టబ్ స్నానం చేసిన వారికి ఏ వ్యాధులు రాలేదని వారి అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించినట్లు ప్రచురించింది.