- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్య కేసును ఛేదించిన బాసర పోలీసులు
దిశ, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో జనవరి 23వ తేదీన జరిగిన సావిత్రి(31) అనే మహిళ హత్య కేసును బాసర పోలీసులు చేధించారు. ఈ హత్యలో అఫ్జల్(27) అనే నిందితుడిని అరెస్ట్ చేశామని, అక్రమ సంబంధమే ఈ హత్య కు కారణమని భైంసా డీఎస్పీ నర్సింగ్ రావు తెలిపారు. సోమవారం రాత్రి విలేకరుల సమక్షంలో వివరాలు వెల్లడించారు. మృతురాలు సావిత్రికి దర్మాబాధ్‌కు చెందిన షేక్ ఆఫ్జల్‌తో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసిందని తెలిపారు.
ఈ విషయం ఇంట్లో తెలియడంతో మృతురాలి కుటుంబ సభ్యులు మందలించారన్నారు. మృతురాలి కూతురు సంజనకు రూ.3200, ఒక జత బట్టలు ఇచ్చి ధర్మాబాధ్ వెళ్లి అఫ్జల్‌కు ఇచ్చి, మళ్లీ ఇంటికి రావొద్దని చెప్పి పంపించింది. దీంతో అఫ్జల్ అదే రోజు రాత్రి మృతురాలి ఇంటికి వచ్చాడు. సంజన మళ్లీ ఎందుకు వచ్చావని తిట్టి వెళ్లగొట్టింది.
అనంతరం వెళ్లినట్టే వెళ్లి, ఆ పక్కనే ఉన్నాడు. మృతురాలు మలమూత్ర విసర్జనకు బయటకు రాగా, ఆమె వద్ద వచ్చి ఆమెను గొంతు నులిమి చంపేసి పుణెకు పారిపోయాడని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులు పుణె లోనే కూలీ పని చేసుకుంటూ ఉన్నాడని, రెండ్రోజుల క్రితమే పుణె నుంచి ధర్మాబాద్‌కు వచ్చి అతని ఇంట్లో ఉండగా.. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం నేరస్తుడిని ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు డీఎస్పీ వెల్లడించారు.