- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌పై సుంకంతో కొనుగోలు ఖర్చుల భారం!
దిశ, వెబ్‌డెస్క్ : ఏప్రిల్ 1 నుంచి సోలార్ సెల్స్, మాడ్యుల్స్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకం(బీసీడీ) విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం సోలార్ విద్యుత్ ధరల పెంపునకు దారితీస్తుందని ఇండియా రేటింగ్స్(ఇండ్-రా) తెలిపింది. అంతేకాకుండా దేశీయ తయారీదారులకు గణనీయమైన మూలధన వ్యయంపై ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ పరిణామాలు సౌర ప్రాజెక్టుల నిర్వహణ, వినియోగదారులను తగ్గిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
‘2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే సోలార్ సెల్స్, మాడ్యుల్స్‌పై కస్టమ్స్ సుంకం మొత్తం ప్రాజెక్టుల వ్యయాల పెరుగుదలకు దారి తీస్తుంది. ఈ సుంకాల పెంపు వల్ల సౌర విద్యుత్ కొనుగోలు ఖర్చులు ఏటా రూ. 900 కోట్లు పెరుగుతాయి. రాబోయే 12 నెలల్లో సుమారు 10 గిగావాట్ల సౌర సామర్థ్యంపై ప్రభావం ఉంటుందని’ ఇండ్-రా సీనియర్ అనలిస్ట్ అస్మితా పంత్ చెప్పారు. సుంకం అమల్లోకి వచ్చే సమయం లేదా దిగుమతి ఖర్చులు, స్థానిక తయారీ వ్యయం సమానస్థాయిలో వచ్చే వరకు ఈ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా 2030 నాటికి 280 గిగావాట్ల సౌర సామర్థ్యం సాధించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రభావితం చేస్తుందని అస్మితా పంత్ వెల్లడించారు.