- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దీపిక’ కు బేరియాట్రిక్ సర్జరీ చేసిన పశువైద్యులు
దిశ,వెబ్‌డెస్క్ : జంతు ప్రేమికులు చాలా మందే ఉంటారు. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులంటే చాలా ఇష్టాన్ని చూపెడుతారు. ఎక్కువగా కుక్కల్ని పెంచుకుంటూ.. దానికి మనకు నచ్చిన పేరు పెట్టుకుని మన ఇంటిలోని మనిషిలానే చూసుకుంటాం. అయితే పూణెలో యాస్మిన్ దారువాలా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి ముద్దుగా ‘దీపిక’ అని పేరు పెట్టుకున్నారు. అయితే ‘దీపిక’ అనే శునకం రోజు రోజుకు విపరీతంగా బరువు పెరగడం మొదలైంది. దీంతో దానికి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీపిక అలా బరువు పెరుగుతూ ఏకంగా 50 కిలోలు పెరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు దీపిక శునకాన్ని ఆసుపత్రిలో చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం వారు ఓ జంతు వైద్యున్ని కలిశారు.
దీంతో దీపిక ను పరిశీలించిన డాక్టర్ దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయాలని సూచించారు. దీపిక బాధ చూడలేని దారువాలా ఎలాగైన దానికి సర్జరీ చేయించాలనుకుంది. దాంతో రూ. 1.20 లక్షల ఖర్చుతో ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేయించారు. ఎనిమిదేళ్ల ఆరు నెలల వయసున్న దీపిక శునకానికి సర్జరీ చేసి దానిలో పేరుకపోయిన 5 కిలోల అదనపు కొవ్వును బయటకి తీశారు వైద్యులు. కానీ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఓ శునకానికి చేయడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.