- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో పెట్టుబడుల పరంపర.. భారీ నిధులతో ముందుకొచ్చిన బార్‌క్లేస్ బ్యాంక్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విదేశీ బ్యాంక్ బార్‌క్లేస్ పీఎల్‌సీ ఇండియా రూ. 3,000 కోట్ల పెట్టుబడులను గురువారం ప్రకటించింది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్‌లో ఈ బ్యాంక్ మొత్తం మూలధన పెట్టుబడి రూ. 8,300 కోట్లకు పైగా చేరుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిధుల ద్వారా బ్యాంకు కార్పొరేట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ క్లయింట్ వ్యాపారాల వృద్ధికి మరింత దోహదపడుతుందని బార్‌క్లేస్ తెలిపింది. గత కొన్నేళ్లుగా బార్‌క్లేస్ బ్యాంకు దేశీయంగా ఆర్థిక కార్యకలాపాల్లో అతి పెద్ద వ్యాపారాన్ని కలిగి ఉంది.
నగదు నిర్వహణ సహ పెట్టుబడులు, కార్పొరేట్ విభాగంలో ట్రేడ్ ఫైనాన్స్, ఇంకా ఇతర నిర్వహణ వ్యాపారాలను కొనసాగిస్తోంది. అలాగే, ప్రైవేట్ క్లయింట్ల వ్యాపారంలో ఆస్తుల నిర్వహణ గణనీయంగా పెరుగుతోందని బ్యాంకు వివరించింది. ‘ గత మూడు దశాబ్దాలుగా భారత్‌లో విజయవంతమైన, మెరుగైన పనితీరుకు తాజా పెట్టుబడులే నిదర్శనం. భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించాలనే లక్ష్యం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశీయంగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పెట్టుబడులను వేగవంతం చేస్తున్నామని’ బార్‌క్లేస్ ఆసియా-పసిఫిక్, కంట్రీ హెడ్ జైదీప్ ఖన్నా అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఇటీవల ఊపందుకుంటున్న తరుణంలో ఖాతాదారుల నుంచి డిమాండ్ పెరిగింది. అందుకోసం ఈ పెట్టుబడులను ప్రకటిస్తూ, వినియోగదారులకు అందించే సేవలపై కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.