- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్మశానానికి వస్తున్న వారికి స్వాగతం.. మోడీ, సీఎం పరువు తీసిన ఎమ్మెల్యే.!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కర్నాటకలోని ఎలహంకలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఎవరైనా వ్యక్తి కరోనాతో మృతి చెంది.. అంతిమ సంస్కరాల కోసం శ్మశానానికి వస్తే.. డెడ్ బాడీతో వచ్చిన వారికి సామూహిక అంత్యక్రియలు చేస్తున్న చోట బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.
అంత్యక్రియల కోసం వస్తున్న వారికి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో.. ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నాము, మీకు నీళ్లు, టీలు, కాఫీలు, టిఫిన్‌లు, భోజనాలు ఫ్రీ అంటూ ప్రకటనలు ఇచ్చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కరోనాతో చనిపోయిన బాధలో వారు అంత్యక్రియల కోసం వస్తుంటే.. మీరు అక్కడ కూడా ప్రచారం చేసుకుంటున్నారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫ్లెక్సీపై ఎమ్మెల్యే విశ్వనాథ్ క్షమాపణలు చెప్పి, బ్యానర్ గురించి తనకు తెలియదని అన్నారు. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగిస్తున్నట్టు తెలిపారు.