అమెరికన్ నటి నగ్న ఫొటోకు పేరడీ ఆర్ట్.. రూ.30 కోట్లకు వేలం?

by Shyam |   ( Updated:2021-03-16 02:59:35.0  )
Demi Moore nude parody
X

దిశ, ఫీచర్స్: అమెరికన్ ఫేమస్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ డెమీ మూర్‌ ఎన్నో కష్టాలు ఎదుర్కొని నటిగా స్థిరపడింది. జర్మన్ యాక్ట్రెస్ నస్తాస్జ కింస్కిని చూసి ఇన్‌స్పైర్ అయి తాను నటి కావాలనుకుంది. ఇందుకు డెమీ మూర్ డ్రామా క్లాసెస్ అటెండ్ అయి నటనలో ప్రావీణ్యం తెచ్చుకుంది. 1981లో ‘చాయ్‌సెస్’ ఫిల్మ్ ద్వారా డెబ్యూ అయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరగి చూసుకోలేదు. మోడల్‌, నిర్మాత, దర్శకురాలు, లిరిక్‌ రైటర్‌‌గా ఎంతో పేరు సంపాదిందించుకుంది. అయితే ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో 1991లో ‘వానిటీ ఫెయిర్’ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫొటోలు దిగి సంచలనం సృష్టించింది. దీనిపై ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ ఫొటోకు ఫేమస్ బ్రిటిష్ గ్రాఫిటీ ఆర్టిస్ట్ బ్యాంక్సీ పేరడీ ఆర్డ్ వేశాడు. కోతి ముఖంతో, నోట్లో సిగరెట్ పెట్టుకున్న ఏడు అడుగుల కాన్వాస్‌పై చిత్రించిన ఆ ఆర్ట్‌ను తొలిసారి 2006లో యూఎస్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించారు. ఆ పేరడీ ఆర్ట్‌ను ‌లండన్‌ ఆక్షన్ కంపెనీ సోథ్‌బై త్వరలో వేలం వేయనుంది.

డెమీ మూర్ పేరడీ ఆర్డ్‌ను తొలిసారి 2006లో మూడు రోజుల పాటు యూఎస్‌లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఎగ్జిబిషన్‌కు 30 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. వారిలో బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ, జూడ్ లా, కీను రీవ్స్, ఓర్లాండో బ్లూమ్, డెన్నిస్ హాప్పర్, కామెరాన్ డియాజ్, సాచా బారన్ కోహెన్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు. కాగా తొలిసారి డెమీ మూర్ పేరడీ ఆర్డ్‌ను సోథ్ బై కంపెనీ వేలానికి ఉంచింది. ఈ నెల 25న లండన్‌లోని సోథ్ బై కంపెనీ ఆక్షన్ హౌజ్‌లో ‘ఆధునిక పునరుజ్జీవనం: క్రాస్-కేటగిరీ అమ్మకం’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా వేలం వేయనున్నారు. ఈ వేలాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా, ఆర్ట్‌కు 3 మిలియన్ పౌండ్ల (రూ.30,11,92,200) వరకు పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

‘బ్యాంక్సీ చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సెలబ్రిటీల ఫొటోలతో పాటు ఐకానిక్ మ్యాగజైన్ కవర్ చిత్రాలపై అతడు వేసే వ్యంగ్య చిత్రాల గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే వాటిని పేరడీ చిత్రాలుగా కాకుండా మరో కోణంలో చూస్తే అతడి పనితనం ఏంటో మనకు అర్థమవుతుంది. డెమీ మూర్ పేరడీ ఫొటోను ఆధునిక సంతానోత్పత్తి దేవతలాగా చూడొచ్చు. గర్భిణుల చిత్రాలు ఆధునికంగా వచ్చినవి ఏం కాదు, కళా చరిత్రలో ఇవి చాలా సాధారణం. కానీ వ్యంగ్య చిత్రాలను గీయడం చాలా కష్టం. భిన్నమైన కోణం నుంచి మాత్రమే అలాంటి ఆలోచనలు వస్తాయి’ అని సోథ్‌బే కాంటెంపరరీ ఆర్ట్ హెడ్ ఎమ్మా బేకర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story