- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు అండగా ఉండాలి
దిశ, తెలంగాణ బ్యూరో : సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎంఎస్ఎంఈ రంగం కోసం ఇండియన్ బ్యాంక్ చేపట్టిన ప్రేరణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. వ్యవస్థలో బలహీనుడి పక్షంగా నిలబడాలని సీఎం కేసీఆర్ పదే పదే గుర్తు చేస్తారని, ఈ దిశగానే తమ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని స్వయం సహాయక సంఘాలు గత రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీ పేమెంట్ శాతాన్ని కలిగి ఉన్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందనన్నారు. అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్మెంట్ రంగంలోని అవకాశాలను పరిశీలించాలని బ్యాంక్ సీఈఓ, ఎండీ పద్మజాను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్ , వీ-హబ్ లో భాగస్వాములు కావాలని కోరారు.
దేశంలో ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం మరియు బ్యాంకుల నుంచి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి, అవి తిరిగి గాడిన పడే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉండేందుకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతో పాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీన్ని మరింత సులువు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎంఎస్ఎంఈ రంగ కంపెనీలను ఆదుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇండియన్ బ్యాంక్ భాగస్వామ్యమై ఎంఎస్ఎంఈలకు సహాయం చేయాలని కోరారు. ఇండియన్ బ్యాంక్ సీఈవో, ఎండీ పద్మజా చుండూరు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉండేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా మంత్రి కేటీఆర్ నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు సీనియర్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.