- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకు సంఘాల సమ్మె బాట
భారతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు సమ్మె నిర్వహించనున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు భారతీయ బ్యాంకర్ల సంఘం ప్రతినిధులతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్‌బీయూ పశ్చిమబెంగాల్ కన్వీనర్ సిద్ధార్థ ఖాన్ తెలిపారు. కనీసం 15 శాతం వేతనాలు పెంచాలని తాము కోరుతుండగా.. ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంచేందుకు అంగీకరించిదని తెలిపారు. ఇది ఏమాత్రం ఆమోదించదగినది కాదని స్పష్టం చేశారు.
ఇది కాకుండా మరో యూనియన్ బీఈఎఫ్ ఐ ( బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మార్చి 27 నుంచి 15 రోజుల దీర్ఘకాల సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఓ ప్రకటనలో ఆ సంఘం నేతలు పేర్కొన్నారు.
Tags: bank unions, strike, national news